ఓటీటీలోకి రాధేశ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Radhe Shyam OTT Release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఫాంటసీ ప్రేమకథ చిత్రం రాధేశ్యామ్.
Radhe Shyam OTT Release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఫాంటసీ ప్రేమకథ చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీపడుతున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైం భారీ ఒప్పందానికి రాధేశ్యామ్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. సాధారణంగా ఏ సినిమా అయిన థియేట్రికల్ రిలీజ్ అనంతరం 4 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫాంకు వస్తుంది. అంటే 'రాధేశ్యామ్' ఏప్రిల్ 11 తర్వాతే ఓటీటీలోకి అడుగుపెట్టాలి. కానీ ఏప్రిల్ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాధేశ్యామ్ స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.