Allu Ayaan: మై డాడ్ మై హీరో.. అయాన్ స్పెషల్ లెటర్.. ఎమోషనల్ అయిన బన్నీ..
Allu Ayaan: ఏ తండ్రి అయిన తన పిల్లలకు తానే మొదటి హీరో కావాలనుకుంటారు. అలా ఉండడానికే ప్రయత్నిస్తారు. అలాగే పిల్లలు కూడా తన తండ్రే తమకు మొదటి హీరోగా ఉండాలనుకుంటారు.
Allu Ayaan: ఏ తండ్రి అయిన తన పిల్లలకు తానే మొదటి హీరో కావాలనుకుంటారు. అలా ఉండడానికే ప్రయత్నిస్తారు. అలాగే పిల్లలు కూడా తన తండ్రే తమకు మొదటి హీరోగా ఉండాలనుకుంటారు. మా నాన్న నా హీరో అని చెప్పినప్పుడు తండ్రిగా అతని సంతోషానికి అవధులుండవు. తాజాగా పుష్ఫ2 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా బన్నీకి తన కుమారుడు అయాన్ ఓ స్పెషల్ లెటర్ రాశాడు. అది చదివిన అల్లు అర్జున్ లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన నోట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రియమైన నాన్న.. మీ విజయం, కృషి, అభిరుచి, అంకితభావం గురించి నేను ఎంతగా గర్వపడుతున్నానో చెప్పడానికి ఈ నోట్ రాస్తున్నాను. నిన్ను నెంబర్ 1 స్థానంలో చూసినప్పుడు.. నేను ఈ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు ఒక గొప్ప నటుడి సినిమా వస్తున్నందుకు ఇదొక ప్రత్యేకమైన రోజు. పుష్ప కేవలం సినిమా మాత్రమే కాదు.. నటనపై మీ అభిరుచి, ప్రేమకు ప్రతిబింభం. ఫలితం ఏమైనప్పటికీ మీరు ఎల్లప్పుడూ నా హీరో, నా స్పూర్తి. ఈ దేశంలో మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందులో నేనే మీ నెంబర్ 1 అభిమానిని. గర్వించదగిన కొడుకు తన మొదటి హీరోకు రాస్తున్నా గమనిక అంటూ అల్లు అర్జున్ కోసం స్పెషల్ లేఖ రాశాడు అయాన్.
ఈ లెటర్ చదివిన బన్నీ ఎమోషనల్ అయ్యారు. దీనిని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నా కొడుకు అయాన్ ప్రేమ నా హృదయాన్ని తాకింది. ఇప్పటి వరకు ఇదే నా అతి పెద్ద విజయం. అలాంటి ప్రేమ లభించడం నా అదృష్టం అన్నారు.