Puja Hegde in Raghava Lawrence Kanchana 4 Movie: రాఘవ లారెన్స్ కాంచన సిరీస్ నుంచి త్వరలోనే పార్ట్-4 తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్ ఇచ్చారు లారెన్స్. రీసెంట్‌గా కాంచన-4ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి కథ మొత్తం పూర్తయిందని.. గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అలరిస్తుందని లారెన్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వం వహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చారు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్ధనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2015లో వచ్చిన గంగా (కాంచన3) సూపర్ హిట్ సాధించింది.
ఇక దానికి కొనసాగింపుగా కాంచన-4 మూవీని తీస్తున్నట్టు చెప్పారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్‌కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మొదట ఈ పాత్రకు నయనతారను అనుకున్నప్పటికీ.. చివరకు పూజా హెగ్డేను (Nayanathara replace by Puja Hegde) సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు కోలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే దళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పూజాకు కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది. కాంచన-4 మూవీలో నటించే ఛాన్స్ (Puja Hegde in Kanchana 4 Movie) కొట్టేసింది. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి మరి.