మెగాస్టార్ చిరంజీవి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నిర్మాత
Natti Kumar: ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Natti Kumar: ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. "అసలు చిరంజీవి గారికి ఈ సినిమా నిర్మాతలు గుర్తున్నారా లేదా?" అంటూ ప్రశ్నించిన నట్టి కుమార్ దయచేసి విభజించి పాలించవద్దు అని వేడుకున్నారు. "ఏపీ ప్రభుత్వం 35 జీవోలు ఇచ్చింది కానీ అవి అమలులోకి మాత్రం తీసుకు రాలేదు. దయచేసి వాటిని రద్దు చేయొద్దు. టికెట్ ధర వంద రూపాయలు ఉండటం వల్ల మాత్రమే "తిమ్మరుసు", "ఎస్ ఆర్ కళ్యాణ మండపం" వంటి సినిమాలు మంచి కలెక్షన్లను వసూలు చేశాయి అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా చిరంజీవి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో మధ్య జరగనున్న భేటీలో బాలకృష్ణను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. ఆ మీటింగులో పెద్ద పెద్ద నిర్మాతలు తప్ప చిన్న నిర్మాతలు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "కరోనా టైంలో థియేటర్లకు మూడు నెలల పాటు కరెంటు బిల్లు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అవి అమలు చేయలేదు. చిరంజీవి గారు చిన్న పెద్ద వాళ్లను కలుపుకుంటూ పోవాలి. జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, ఎమ్మార్వో తో మాట్లాడనా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణను సినిమా హబ్ అని ప్రకటిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని ఎవరూ పట్టించుకోవడం లేదు. సురేష్ బాబు వంటి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా వారి సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఇచ్చేసి థియేటర్లకు అన్యాయం చేస్తున్నారు," అని ఆయన వేలెత్తి చూపించారు. చివరగా దాసరి నారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారిని అంతగా గౌరవిస్తామని, ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చిరంజీవి గారు అందరి వాడిగా ముందుకు సాగాలి అని ఆయన కోరుకున్నారు.