వ్యాపార రంగంలోకి ప్రభాస్.. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ను..

Prabhas: "బాహుబలి" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 కోట్ల చొప్పున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2022-07-06 11:45 GMT

వ్యాపార రంగంలోకి ప్రభాస్.. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ను..

Prabhas: "బాహుబలి" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 కోట్ల చొప్పున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రభాస్ తనకు వచ్చిన డబ్బులలో కొంత డబ్బును ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, మొదలగు హీరోల లాగా ప్రభాస్ కూడా తన డబ్బులను ఒక హోటల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దుబాయ్ మరియు స్పెయిన్ లో ఒక పెద్ద హోటల్ ని నిర్మింపబడుతుండగా ప్రభాస్ అందులో ఒక స్టేక్ హోల్డర్ గా మారాలని అనుకుంటున్నారట. నిజానికి కరోనా తర్వాత హోటల్ మరియు రిసార్ట్ బిజినెస్ లు అంతగా నడవటం లేదు. మరోవైపు ఇండియాలో కాకుండా ఎక్కడో దూరంగా ఇలాంటి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయటం ప్రభాస్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

మరోవైపు ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. "కే జి ఎఫ్" ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", ఓమ్ రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", నాగ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్టు కే", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" వంటి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని సైన్ చేశారు.

Tags:    

Similar News