Ponniyin Selvan: తెలుగు మార్కెట్ ని చిన్నచూపు చూస్తున్న మణిరత్నం..?
Ponniyin Selvan: తెలుగు మార్కెట్ ని చిన్నచూపు చూస్తున్న మణిరత్నం..?
Mani Ratnam: ఈ మధ్యనే బాలీవుడ్ లో "బ్రహ్మాస్త్ర" సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా అన్ని భాషలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరొక ప్యాన్ ఇండియన్ సినిమా "పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1". ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ స్టార్ కాస్ట్ తో తెరకక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఇక తమిళనాడులో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాని బాగానే ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం తెలుగులో కనీసం సినిమా టైటిల్ కూడా మార్చకుండానే విడుదల కి సిద్ధమవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కూడా చాలా కీలకంగా మారుతున్నాయి.
బ్రహ్మాస్త్ర, కేజిఎఫ్ వంటి సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు అందించిన ఆదరణ సినిమలని బ్లాక్ బస్టర్ లు గా మార్చింది. బ్రహ్మాస్త్ర చిత్ర బృందం తెలుగులో ప్రమోషన్ల కోసం భారీగానే ఖర్చు పెట్టింది. కానీ మణిరత్నం మాత్రం తెలుగు లో ప్రమోట్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఇప్పటికైనా తెలుగు మార్కెట్ కి ఉన్న విలువను తెలుసుకొని సినిమాని తెలుగులో కూడా ప్రమోట్ చేస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు సైతం సూచిస్తున్నాయి.