Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు..

Salman Khan: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద ఇటీవలే కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

Update: 2024-07-02 12:00 GMT

Salman Khan: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద ఇటీవలే కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. నటుడిని చంపేందుకు పక్కా స్కెచ్‌ వేసినట్లు నవీ ముంబై పోలీసులు తాజాగా తేల్చారు.

మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. 25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. నటుడి హత్యకు మోడ్రన్‌ వెపన్స్‌ కొనుగోలుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్‌ ఆయుధాలను వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News