OTT Movies: రొటీన్‌ సినిమాలు బోర్‌ కొడుతున్నాయా.? ఓటీటీలో ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి..!

OTT Telugu Movies: ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ ప్రేక్షకుల అభిరుచి సైతం మారింది. సరికొత్త కంటెంట్ కోసం చూసే వారికి మేకర్స్‌ ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి.

Update: 2024-07-03 11:30 GMT

OTT: రొటీన్‌ సినిమాలు బోర్‌ కొడుతున్నాయా.? ఓటీటీలో ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి..!

OTT Telugu Movies: ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ ప్రేక్షకుల అభిరుచి సైతం మారింది. సరికొత్త కంటెంట్ కోసం చూసే వారికి మేకర్స్‌ ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. అయితే రొటీన్‌ మూవీస్‌కు గుడ్‌బై చెబుతూ మేకర్స్ సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు కొన్ని స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి.? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

* ఓటీటీలో అందుబాటులో ఉన్న ఇంట్రెస్టింగ్ మూవీస్‌లో '105 మినిట్స్‌' ఒకటి. ఈ సినిమా కేవలం ఒకే క్యారెక్టర్‌తో నడుస్తుంది. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక పాత్ర ఒక్కటే ఉండడం విశేషం. ఇక సినిమా షూటింగ్ కూడా కేవలం 6 రోజుల్లోనే పూర్తి కావడం మరో విశేషం. హీరోయిన్‌ (హన్సిక) ఇంట్లో ఓ అదృశ్య శక్తి ఉంటుంది. తన మరణానికి హన్సికనే కారణమని ఆమెను రోజూ భయపెడుతుంటుంది. అయితే ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడింది అన్నదే సినిమా కథాంశం. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

* సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న 'భ్రమయుగం' మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్ ఫార్మట్‌లో తెరకెక్కించడం విశస్త్రషం. తాంత్రిక విద్యలు నేర్చుకున్న ఒక మంత్రగాడి బారి నుంచి యువకుడు ఎలా బయటపడ్డాడన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

* 'ఆరంభం' అనే వెరైటీ చిత్రం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్లుండి మాయవుతాడు. ఇంతకీ ఆ ఖైదీ జైలు నుంచి ఎలా బయటపడ్డాన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అజయ్‌ నాగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ లీడ్‌ రోల్‌లో నటించాడు.

* ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం 'ప్రసన్న వదనం'. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికరమైన కథాంశతో నడుస్తుంది. ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన ప‌డిన ఓ రేడియా జాకీ.. తన కళ్ల ముందు హత్య జరగ్గా పోలీసులకు సమాచారం ఇస్తాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేని అతడు హత్యకు సంబంధించిన వివరాలు ఎలా చెప్పగలిగాడు? ఆ ప్రయత్నంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి.? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags:    

Similar News