కష్టంగా మారిన ఓటీటీ, ఏటీటీల మనుగడ

Update: 2021-01-06 09:48 GMT

సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. షూటింగ్‌లు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ధియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో బడా బడా హీరోల నుంచి ఆర్టిస్టులు వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఈ విపత్కర సమయంలో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలతో పాటు ఏటీటీలు వచ్చాయి. నిర్మాతలకు కొద్దిగా అండగా వున్నాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మళ్లీ నిర్మాతలు ధియేటర్లు వైపు చూస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఓటీటీలు, ఏటీటీల మనుగడ కష్టంగా మారనుంది.

ఓటీటీల ప్లాట్‌పామ్‌ అయిన అమెజాన్‌, ఆహా, జీ5 లతో పాటు ఇంకా చాలా చిన్న, చితక ఓటీటీలు, ఏటీటీలు వచ్చాయి. వీటి ద్వారా చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల వరకు తమ సినిమాలను రిలీజ్ చేసుకున్నారు. ఫలితం మాత్రం ఆశించినంత రాలేదు. దీంతో మళ్ళీ ధియేటర్ల బాట పడుతున్నారు నిర్మాతలు.

సీనియర్‌ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు డైరెక్టర్‌గా మారి తీసిన డర్టీ హరి సినిమాను ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ ఫ్రైడే మూవీస్ ద్వారా రిలీజ్ చేసారు. చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ తగలడంతో ఇప్పుడు మళ్ళీ ఆహా లో రిలీజ్ చేసారు. అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో తాజాగా ధియేటర్లో రిలీజ్ కు ప్లాన్ చేసారు. దీంతో ప్రేక్షకులకు ఓటీటీలు, ఏటీటీలపై ఇంట్రస్ట్ ఏ మాత్రం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

నాని నటించిన "వి" సినిమా, రాజ్‌తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాలను కూడా ముందుగా ఓటీటీలో రిలీజ్‌ చేశారు. కానీ వసూళ్ళు లేకపోవడంతో మరోసారి ధియేటర్లలో రిలీజ్ చేసారు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా పరిస్థితి ఇలానే వుండటంతో ఏటీటీలు, ఓటీటీలు స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నవారికి ఇది ఒక హెచ్చరికలా మారడంతో వాటిని మధ్యలోనే ఆపేసుకుంటున్నారు. 

Tags:    

Similar News