OTT: ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఒక్కో రోజే 15 సినిమాలు/వెబ్ సిరీస్‌లు..
OTT: వీకెండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ ఓటీటీలవైపు చూస్తున్నారు. పెరిగిన పోటీ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సైతం సరికొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను తీసుకొస్ఉతన్నాయి.
OTT: వీకెండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ ఓటీటీలవైపు చూస్తున్నారు. పెరిగిన పోటీ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సైతం సరికొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను తీసుకొస్ఉతన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వీకెండ్‌కు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఎలాంటి కంటెంట్ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
* ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాట్ నెట్ ఫ్లెక్స్ వేదికగా లెట్ గో - స్వీడిష్ సినిమా, ఇట్స్ ఆల్ ఓవర్ - స్పానిష్ సినిమా, బార్బీ మిస్టరీస్ - ఇంగ్లీష్ సిరీస్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
* ఇక అమెజాన్ ప్రైమ్‌లో గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన విశ్వం మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు సూరజ్ సూదేశ్ మూవీ - మలయాళ మూవీ, సత్తం ఎన్ కయిల్ - తమిళ సినిమా, ఇబ్బని తబ్బిడ ఇలయాలీ - కన్నడ మూవీ, బ్లాక్ - తమిళ సినిమా, ఫ్రీడమ్ - ఫ్రెంచ్ చిత్రం, యుధ్రా - హిందీ సినిమా (రెంట్ విధానం), హిట్లర్ - తెలుగు డబ్బింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
* హాట్‌స్టార్ వేదికగా మ్యూజిక్ బై జాన్ విలియమ్స్ - ఇంగ్లీష్ సినిమా, లబ్బర్ పందు - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది), ఎక్స్‌ప్లోరర్: ఎండ్యురెన్స్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 3) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
* తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా వేదికగా అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 - తెలుగు సిరీస్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక కలి అనే తెలుగు సినిమా సైతం స్ట్రీమింగ్ అవుతోంది.
* జియో సినిమాలో దస్ జూన్ కి రాత్: చాప్టర్ 2 - హిందీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
* అలాగే జీ5 వేదికగా మిథ్య: ద డార్క్ చాప్టర్ - హిందీ సిరీస్ అందుబాటులోకి వచ్చేసింది.
* ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న తంగలాన్ తమిళ వెర్షన్ ఆస్ట్రో మూవీస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అంధగన్ (తమిళ సినిమా) సైతం అందుబాటులోకి వచ్చేసింది.