OG Movie: 'ఓజీ' నుంచి స్పెషల్‌ వీడియో..!

దర్శకుడు సుజిత్ పుట్టిన రోజు సందర్భంగా 'ఓజీ' చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది.

Update: 2024-10-26 13:00 GMT

OG Movie: 'ఓజీ' నుంచి స్పెషల్‌ వీడియో..!

OG Movie: పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఓజీ'. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండగా.. ఎన్నికల్లో పవన్ భారీ విజయాన్ని అందుకోవడం, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా సేవలందిస్తుండడంతో ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యవవుతోంది. అయితే తాజగా పవన్‌ ఈ సినిమాకు డేట్స్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ముంబయిలో ఓ భారీ సెట్ వేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కాగా ఇప్పటి వరకు ఓజీ నుంచి మేకర్స్‌ పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా దర్శకుడు సుజిత్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. దర్శకుడు సుజిత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ముంబయితో పాటు కొన్ని సెట్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. వీడియో చివరిలో పవన్‌ వెనకాల నుంచి కనిపిస్తున్న షాట్‌ను వీడియోలో మేకర్స్‌ చూపించారు.

ఇదిలా ఉంటే ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) చిత్రాన్ని జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విజయవాడలో సెట్‌లో నిర్వహించాలనుకున్న సన్నివేశాలను ఫిల్మ్‌ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ఇందులో పవన్‌కు జోడిగా.. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తుండగా, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

Full View


Tags:    

Similar News