Movies: దీపావళికి వినోదాల వెలుగులు.. ఈ వీకెండ్ సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు..

OTT, Theatres movie releases this week: తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.

Update: 2024-10-28 10:39 GMT

OTT, Theatres movie releases this week

పండగ వచ్చిందంటే షాపింగ్‌కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వినోదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగ సీజన్‌లో మూవీస్‌ను విడుదల చేయడం టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వస్తోన్న ఓ ఆచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేయండి..

థియేటర్లలో సందడి చేయనున్న చిత్రలివే..

లక్కీ భాస్కర్‌..

ఈ వారం ఎక్కువ క్యూరియాసిటీ ఉన్న చిత్రాల్లో లక్కీ భాస్కర్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాలి. ఈ నెల 31వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దుల్కర్‌ సల్మన్‌ హీరోగా మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక రూ. 6 వేల జీతం వచ్చే సాధారణ ఉద్యోగి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు.? ఈ క్రమంలో ఆయన ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు లాంటి అంశాలను ఇందులో చూపించనున్నారు.

అమరన్‌..

ఈవారం సందడి చేయడానికి సిద్ధమవుతోన్న మరో చిత్రం అమరన్‌. ఉగ్రవాదుల దాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమల్‌ హాసన్‌ నిర్మించిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు.

'క'..

ప్రేక్షకులను అలరించేందుకు వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'క'. కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టైటిల్‌తోనే అంచనాలు పెంచేసింది. ఇప్పటి వరకూ చూడని లుక్‌లో కిరణ్‌ ఇందులో కనిపించనున్నారు. ఈ నెల 31న సినిమా రిలీజ్ కానుంది.

బఘీర..

కేజీఎఫ్‌, సలార్‌ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న ప్రశాంత్‌ నీల్ కథ అందించిన చిత్రం.. బఘీర ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సూపర్‌మ్యాన్‌ తరహా శక్తులేవీ లేకుండానే సూపర్‌హీరో అనిపించుకున్న ఓ వ్యక్తి కథతో రూపొందిన చిత్రం ఇది. ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు.

ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్ సిరీస్‌లు..

* లవ్‌ మాక్‌టైల్‌ సీజన్‌ 2 (తెలుగు వెబ్‌సిరీస్‌) అక్టోబరు 31వ తేదీ నుంచి ఈటీవీ విన్‌ యాప్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

* టైమ్‌ కట్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 30వ తేదీ నుంచి, మర్డర్‌ మైండ్‌ఫుల్లీ (హాలీవుడ్‌): అక్టోబరు 31వ తేదీ నుంచి, ది డిప్లోమ్యాట్‌ సీజన్‌ 2 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): అక్టోబరు 31వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

* మిథ్య (వెబ్‌సిరీస్‌.. తెలుగులోనూ): నవంబరు 1వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ మొదలు కానుంది.


Tags:    

Similar News