Alia Bhatt: 'అలియా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా'.? ఇచ్చి పడేసిన బ్యూటీ..
Alia Bhatt: సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు సైతం ఉన్నాయి.
Alia Bhatt: సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సోషల్ మీడియా కారణంగా ట్రోల్స్ బాధ తప్పడం లేదు. రకరకాల వార్తలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. 'ఇదిగో తోక అంటే.. అదిగో పులి' అన్నట్లు మారింది సోషల్ మీడియా వ్యవహారం.
ఎంతో మంది హీరోయిన్లు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొంది. అందం కోసం అలియా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇలాంటి వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అలియా. తాను నవ్వే తీరు అస్సలు బాగోదని వీడియోల ద్వారా కొందరు చేస్తున్న దుష్ప్రచారంపై అలియా మండిపడింది.
‘కొందరైతే నేను అనారోగ్యం బారిన పడ్డానని దారుణమైన ప్రచారానికి దిగారు’ అని అలియా వాపోయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం ప్రచారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా పోస్ట్‌లు పెట్టడం చట్టప్రకారం నేరమన్న అలియా.. కేవలం వ్యూస్ కోసం ఇలాంటి చవకబారు పనులు చేస్తున్నారంటూ మండి పడింది. ఇక అలాంటి పోస్టులకు చెత్త కామెంట్స్ చేసే వారిలో మహిళలు కూడా ఉండటం సిగ్గుచేటని అలియా చెప్పుకొచ్చింది.
ఇలాంటి ధోరణి ఎప్పటికైనా ప్రమాదమే అన్న అలియా.. ఈ విషయంలో ఇకపై సీరియస్‌గానే చర్యలు తీసుకోబోతున్నా అని ట్రోలర్స్‌ను హెచ్చరించింది. కాగా అలియా కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ఇటీవల జిగ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నటిగా మాత్రం మంచి మార్కులే కొట్టేసింది అలియా.