Pushpa 2: ప్రభాస్ రికార్డుపై అల్లు అర్జున్ కన్నేశాడా?

Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం పుష్ఫ 2.

Update: 2024-10-26 11:30 GMT

Pushpa 2

Pushpa 2 Latest Buzz: అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం పుష్ఫ 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మనదేశంలో తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల చేస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే పుష్ఫ-2 సినిమా.. బాహుబలి మూవీని బ్రేక్ చేస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన చిత్రం బాహుబలి. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచింది. పుష్ప 1 తెలుగుకన్నా హిందీలోనే సూపర్ హిట్ కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

బాహుబలి 2 సినిమా హిందీలో 500 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. అయితే పుష్ప 2 సినిమాకు కూడా హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారంట. పుష్ప సినిమాకు ముందు వరకు అల్లు అర్జున్ పారితోషికం 40 కోట్ల రూపాయలు ఉండేదని.. పుష్ప తర్వాత భారీగా పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 నుంచి 200 కోట్లు తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. ఒక్కోసారి సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారని సమాచారం. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాకు రాబోయే లాభాల్లో వాటాలు కావాలని నిర్మాతలను అడిగారని టాక్. దీని ప్రకారమే నిర్మాతలతో అల్లు అర్జున్ కు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.

పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉండటంతో బాహుబలి కలెక్షన్ల దగ్గరకు లేదంటే.. వాటిని దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ పుష్ప 2 మూవీ ఈ మైలురాయిని అధిగమిస్తే పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తర్వాత అతిపెద్ద స్టార్‌గా అల్లు అర్జున్ నిలుస్తాడని సినీ వర్గాల్లో టాక్. ఇందుకోసం ఇతర భాషల్లోకన్నా ఉత్తరాది రాష్ట్రాల్లోనే ప్రభాస్ కలెక్షన్లను దాటి ముందుకు వెళ్లేలా అల్లు అర్జున్ గట్టి ప్రణాళికతో ఉన్నారని సమాచారం. ఆ ప్రకారమే సినిమా విడుదలను ఒకరోజు ముందుకు జరిపారని తెలుస్తోంది.

ఫిలింనగర్‌లో వినిపిస్తున్న ఈ టాక్ ప్రకారం ఇదే జరిగి పుష్ప 2 మూవీకి కలెక్షన్లు భారీగా వస్తే, టాలీవుడ్ పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మార్మోగడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఇంతకీ పుష్ప-2 బాహుబలిని బ్రేక్ చేస్తుందా? భారీ కలెక్షన్లను రాబడుతుందా? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News