ఇవాళ నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి
Nayanatara Wedding: *మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక
Nayanatara Wedding: ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరు ఇవాళ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతోంది. మహాబలిపురంలోని రిసార్ట్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.