Nani Remuneration: మరోసారి పారితోషికం పెంచిన నాచురల్ స్టార్

Nani Remuneration: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాడు.

Update: 2021-03-09 13:57 GMT

నాని

Nani Remuneration: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాడు. 'వీ' విఫలమైన తరువాత, కొత్త సినిమాల కోసం నాని వెయిట్ చేయాల్సిందేనని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం నాని చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. 'టక్ జగదీష్' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే 'శ్యామ్ సింగ రాయ్', 'అంటే సుందరానికీ' సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా మరో నూతన చిత్రం కోసం చర్చలు చేస్తున్నాడు. వీటితోపాటు హిట్ 2 నిర్మాణంలో కూడా బిజీగా ఉన్నాడు.

నాని సినిమాలు మినిమం గ్యారెంటీ గా ఉంటాయని, బాక్సాఫీస్ వద్ద కూడా బాగా రాణిస్తున్నందుకు నాని తన పారితోషికాన్ని పెంచారని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త బజ్ క్రియోట్ చేస్తుంది. నాని ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కోసం రూ. 14 కోట్లు తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అంతకుముందు, నాని ఒక చిత్రానికి రూ. 10- రూ. 10.5 కోట్లు తీసుకునేవాడు. ఈ ఏడాది రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశాడు. తన రాబోయే చిత్రాల కోసం, నాని దాదాపు రూ. 14 కోట్లు తీసుకోనున్నాడని సమాచారం. అలాగే విజయాన్ని బట్టి తదుపరి చిత్రాలకు పారితోషకం మరింత పెరుగుతుందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News