Akshara Movie Review: 'అక్షర' మూవీ రివ్యూ

Akshara Movie Review: 'అక్షర' హీరోయిన్ ఓరియోంటెడ్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది.

Update: 2021-02-26 09:36 GMT

అక్షర మూవీలో నందిత శ్వేత (ఫోటో హన్స్ ఇండియా )

Akshara Movie Review: 'అక్షర' హీరోయిన్ ఓరియోంటెడ్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. దానికి తగినట్లుగానే ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు టాలీవుడ్ సినిమాపై మరింత హైప్ క్రియోట్ చేశాయి. టైటిల్ రోల్ లో నందిత శ్వేతా నటించిన ఈ సినిమాను చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? నందిత శ్వేత నటన ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..

కథ...

అక్షర (నందిత శ్వేత) అనే యువతికి అమ్మానాన్నలు లేరు. విశాఖలోని విద్యా విధాన్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. స్టూడెంట్లలో ఉన్న భయాల్ని పోగొడుతూ టీచింగ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ కాలేజీకి డైరెక్టర్ శ్రీతేజ (శ్రీతేజ్)కి, అక్షరకు మధ్య ప్రేమ చిగురిస్తుంది. తన ప్రేమను వ్యక్తం చేసే సమయంలో శ్రీతేజ హత్యకు గురవుతాడు. ఇంతలో పెద్ద ట్విస్ట్ ఇస్తూ..శ్రీతేజ తోపాటు ఏసీపీని కూడా తానే హత్య చేశానంటూ అక్షర పోలీసులకి లొంగిపోతుంది. అసలు వారిద్దరిని అక్షర హత్య చేసిందా? అసలు హత్య కు గల కారణాలేంటి? తదితర విషయాల్ని సినిమాలో చూడాల్సిందే.

కథనం...

నేటి విద్యా విధానంలో ర్యాంకుల కోసం కార్సొరేట్ సంస్థలు స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న తీరును ఈ సినిమా సాగుతుంది. ఓ యువతి కార్పొరేట్ యాజమాన్యం తనకు చేసిన అన్యాయంపై ఎలా పగ తీర్చుకున్నదో మూవీలో చక్కగా చూపించారు. అందరూ సులభంగా సినిమాకు కనెక్ట్ అవుతారు. అక్కడక్కడ సాగతీత సన్నివేశాలు, కొన్నింటిని ప్రసంగాల తరహాలో చెప్పడంతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అసలు కథ మొదలవడానికి చాలా సమయం తీసుకున్నాడు డైరెక్టర్. ఫస్టాప్ అంతా చప్పగా సాగుతుంది. శ్రీతేజ హత్య నుంచే అసలు కథ మొదలై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకు అందేట్లుగా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే...

నందిత శ్వేత నటన సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది. ద్వితీయార్థంలో ఆమె పాత్రను బాగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. కార్పొరేట్ విద్యాసంస్థల డైరెక్టర్ గా సంజయ్ కీలక పాత్ర పోషించాడు. విలన్ ఆయన పాత్ర సినిమాకు హైలైట్ అవుతుంది. మధునందన్, షకలక శంకర్, సత్య తదితరులు సినిమా చివరి దాకా ఉంటారు. కానీ వారి కామెడీ అంతగా పండలేదు. టెక్నికల్ పరంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. కెమెరా, సంగీతం కూడా బాగుంది. డైరెక్టర్ చిన్నికృష్ణ కథను అనుకున్నంతగా తెరకెక్కించలేక పోయాడు.

డైరెక్టర్: చిన్నికృష్ణ

నటీనటులు : నందిత శ్వేత, షకలక శంకర్, అజయ్ ఘోష్, తదితరులు

నిర్మాత : అల్లూరి సురేష్ వర్మ, బెల్లంకొండ తేజ

సంగీతం : సురేష్ బొబ్బిలి

ఈ సమీక్ష రచయిత అభిప్రాయానుసారం రాసింది. సినిమాని పెద్ద స్క్రీన్ పై చూసి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది.

Tags:    

Similar News