NTR Jayanthi: నాన్నగారి కోసం బాలయ్య గానం

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య స్వయంగా పాడిన శ్రీరామ దండకం పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Update: 2021-05-28 08:44 GMT

నందమూరి బాలకృష్ణ (ఫైల్ ఇమేజ్)

NTR Jayanthi: నందమూరి తారక రాముడి జయంతి సందర్భంగా అనేకమంది అనేక రకాలుగా నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వీడియోలు, పాటలతో మార్మోగిస్తున్నారు. ఇక ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ మరింత ఎమోషనల్ గిఫ్ట్ అందించారు. తండ్రిని స్మరించుకుంటూ శ్రీరామ దండకాన్ని స్వయంగా పాడటమే కాక.. దానికి ఎన్టీఆర్ నటించిన సినిమాల వీడియోలను దృశ్య రూపంలో జోడించి.. ఆ వీడియోను విడుదల చేశారు.

ఇక మెగస్టార్ చిరంజీవి కూడా అన్నగారికి కేంద్రం భారతరత్నతో గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఎన్టీఆర్ మనవళ్లైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తాత గారికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఇక అన్న ఎన్టీఆర్ తనయుడైన బాలకృష్ణ.. తన తండ్రి పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన స్వయంగా పాడిన శ్రీరామ దండకం పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. వెండితెరపై ఉన్న కథానాయకున్ని.. ఆ బాల గోపాలానికి ఆరాధ్యుడిని చేసిన ఆది అధినాయకుడు. తన పేరులో తారస్థాయిని తన జీవిత సహచారిగా నడిపించిన తారక రాముడు. తెలుగు ఉనికిని తెలుగు నలుచెరుగులు నినదించిన జగదభిరాముడు. తెలుగు గడప రంగు జెండాను ప్రతి గుండెలో ఎగరవేసిన కోదండరాముడు. పేదవారి వెన్నపూస.. తెలుగు జాతి వెన్ను పూస. మా నాన్న గారు.. మీ అన్నగారు జన్మించి 98 ఏళ్లు పూర్తైయ్యాయి. 99 యేడు ప్రారంభమైంది.


Tags:    

Similar News