Nagababu on lockdown: లాక్ డౌన్ చేస్తే బిగ్ మిస్టేక్ అవుతుంది.. ప్రభుత్వాలపై నాగబాబు ఫైర్!
Nagababu on lockdown:తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తన అధికార యూట్యూబ్ ఛానల్ లో స్పందిస్తూ ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు
నాగబాబు: తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తన అధికార యూట్యూబ్ ఛానల్ లో స్పందిస్తూ ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్ పోడిగిస్తారన్న అంశంపైన ఫైర్ అయ్యారు నాగబాబు.. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉందని అన్నారు. మళ్ళీ లాక్ డౌన్ అంటే అది ప్రభుత్వాల తప్పిదమేనని అన్నారు నాగబాబు.. ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందంటూ నాగబాబు వాఖ్యానించారు.
మూడు నెలల లాక్ డౌన్ సమయంలో ప్రజలు తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించారని అన్నారు. ఇక వలస కూలీల పరిస్థితి అయితే దారుణం అని అన్నారు. లాక్ డౌన్ సమయంలో నోరు లేని జీవులు సైతం చాలా ఇబ్బందులు పడ్డాయని అని అన్నారు. కానీ ఈ సమయంలో ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్ని, ప్రజలకు అందించాల్సిన కనీస అవసరాలను విస్మరించిందని అన్నారు. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర మెడికల్ రిసోర్స్‌ని కూడకట్టుకోలేకపోయిందని నాగబాబు మండిపడ్డారు .
తినడానికి తిండిలేదు.. బతుకు గడవడం లేదు. కరోనా వస్తే ఏంటి అనే పరిస్థితి అన్న రివల్యూషన్ మైండ్ ప్రజల్లో వచ్చేసిందని అన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ అంటే చారిత్రాత్మక తప్పిదం చేసినట్టేనని నాగబాబు వాఖ్యానించారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని, తనలాగా మాట్లాడే వాళ్లు కోట్లాది మంది ఉన్నారని అన్నారు.
లాక్ డౌన్ విధించకుండా కరోనా వస్తే ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వాలను చాలా మంది విమర్శించినప్పుడు కరెక్ట్ కాదని చెప్పానని , ఇప్పుడు లాక్ డౌన్ నిర్ణయం ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తుందని అన్నారు. లాక్ డౌన్ పెంచే ఆలోచన ఉంటే విరమించుకోవాలని లక్షలాది మంది ప్రజల పక్షాన నేను కోరుకుంటున్నానని నాగబాబు అన్నారు.