రజనీ ఆరోగ్యంపై మోహన్‌బాబు ఆందోళన.. రజనీ కుటుంబ సభ్యులకు ఫోన్
రజనీ, మోహన్‌బాబు మంచి మిత్రులనే విషయం విధితమే. దీంతో తన స్నేహితుడు రజనీకాంత్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారనే వార్త తెలుసుకున్న మోహన్ బాబు ఆందోళనకు గురయ్యారు.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో ఆయనను శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అపోలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్య బృందం తెలిపింది. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ రజనీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.
రజనీ, మోహన్‌బాబు మంచి మిత్రులనే విషయం విధితమే. దీంతో తన స్నేహితుడు రజనీకాంత్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారనే వార్త తెలుసుకున్న మోహన్ బాబు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు రజనీ సతీమణి లతకు, కుమార్తె ఐశ్వర్యకు, సోదరికి ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మోహన్‌బాబు తిరుపతిలో ఉన్నారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఎలాంటి ఆందోళన అవసరం లేదనీ రజనీ కుటుంబ సభ్యలు చెప్పడంతో మోహన్‌బాబు కుదుటపడ్డారు. రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి త్వరగా కోలుకుని, ఎప్పటిలానే తన పనులు ప్రారంభించాలని మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
రజనీకాంత్ రక్తపోటుకు సంబంధించి ఆయనకు అందుతున్న వైద్యంపై క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నామని.., రక్తపోటు ఇప్పటికి కూడా అధికంగానే ఉంది. రక్తపోటును తగ్గించేందుకు మందులు అందిస్తున్నమని వైద్య బృందం ప్రకటించింది. పరీక్షలు నిర్వహించామని , సాయంత్రంలోగా రిపోర్టు వస్తుందని... ఆ తర్వాత అతనికి అందించాల్సిన చికిత్స గురించి ఆలోచిస్తాం. రజనీ ఆరోగ్యం అంతా సవ్యంగా ఉన్నాకే డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటాం అని అపోలో వైద్య బృందం పేర్కొంది.
'అన్నాత్తై'షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న రజనీకాంత్ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో.. ఆయన్ను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. రజనీ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ఒక అధికార ప్రకటనను విడుదల చేశారు.