కొడుకుతో కలిసి రెండోసారి ప్లాస్మా డొనేట్ చేసిన కీరవాణి
MM Keeravani Donate Plasma: టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. ఇవాళ(సోమవారం) తన కుమారుడు
MM Keeravani Donate Plasma: టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. ఇవాళ(సోమవారం) తన కుమారుడు కాలభైరవతో కలిసి కోవిడ్ బాధితుల కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్మా ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వీళ్లిద్దరూ గతంలోనూ ప్లాస్మా ఇచ్చి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తాజాగా శరీరంలో యాంటీబాడీస్ ఇంకా యాక్టివ్‌గా ఉండటం వల్ల ప్లాస్మా ఇస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నానని.. త్వరలో RRR మ్యూజిక్ ప్రారంభిస్తానని కీరవాణి వెల్లడించారు. అంతకుముందు వీళ్లిద్దరూ కిమ్స్ హాస్పిటల్‌లో మొదటిసారి ప్లాస్మాను డొనేట్ చేశారు. అటు రాజమౌళి కూడా త్వరలో ప్లాస్మా డొనేట్ చేయనున్నారు. గత కొద్ది రోజుల క్రితం రాజమౌళి, కీరవాణి కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే..
ఈ సందర్భంగా కీరవాణి తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.. " మా రక్తంలో ప్రతిరోధకాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నట్లు గుర్తించడంతో, నేను మరియు నా కొడుకు రెండవసారి ప్లాస్మాను దానం చేసాము. ఒకటి కంటే ఎక్కువసార్లు ప్లాస్మా దానం ఇవ్వడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని కీరవాణి వెల్లడించారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి, కీరవాణి కలిసి RRR అనే సినిమాని చేస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.