మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయండి : ఎంపీ అనుప్రియ పటేల్
మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ ను వెంటనే బ్యాన్ చేయాలని అప్నాదళ్ పార్టీ ఎంపీ అనుప్రియ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్త రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కి లేఖ రాశారు.
మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ ను వెంటనే బ్యాన్ చేయాలని అప్నాదళ్ పార్టీ ఎంపీ అనుప్రియ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్త రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కి లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మీర్జాపూర్ ప్రాంతాన్ని హింసాత్మక ప్రాంతంగా చూపించారని, మీర్జాపూర్ పేరును దెబ్బతీస్తున్నారని ఆమె మండిపడ్డారు.
మోడీ, యోగి నాయకత్వంలో మీర్జాపూర్ చాలా ప్రశాంతంగా, సామరస్యంగా ఉందన్నారు. మీర్జాపూర్ ను హింసాత్మకంగా చూపించడంపై విచారణ చేపట్టి, వెబ్ సిరీస్ ను నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో అనుప్రియ పటేల్ రెండో పర్యాయం మీర్జాపూర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు.
ఇక శ్వేత త్రిపాఠి శర్మ, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ అక్టోబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. మొదటి సీజన్‌లో మీర్జాపూర్ వెబ్ సిరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. అయితే సీక్వెల్ మాత్రం కుటుంబాల వైరుద్యాలు, రాజకీయాలు, ఎన్నికల చుట్టూ తిరిగే హింసాత్మక కథ చుట్టూ నడుస్తుంది.. దీనితో వెబ్ సిరీస్ పై తప్పక విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అనుప్రియ పటేల్ కోరారు.
ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు దర్శకత్వం వహించగా, ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ దీన్ని నిర్మించారు.