Mahesh Babu: మొట్టమొదటిసారిగా పౌరాణిక గెటప్ లో సూపర్ స్టార్

*మహేష్ బాబు విలన్ సముతిరఖని కి వరాహావతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది

Update: 2021-10-03 07:46 GMT
Mahesh Babu Plays a Mythical Character in Sarkaru Vaari Paata Movie Pre Interval Scene

Mahesh Babu: మొట్టమొదటిసారిగా పౌరాణిక గెటప్లో సూపర్ స్టార్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

  • whatsapp icon

Mahesh Babu - Sarkaru Vaari Paata: మహేష్ బాబు త్వరలోనే "సర్కారు వారి పాట" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజకీయ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ఉంటుందని సమాచారం.

దర్శకుడు పరశురామ్ కి మాస్ ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. తాజా సమాచారం ప్రకారం "సర్కారు వారి పాట" సినిమాలో కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా కొన్ని అదిరిపోయే సన్నివేశాలని రాసుకున్నాడట పరశురామ్. అందులో ప్రీ ఇంటర్వెల్ సీన్ కూడా ఒకటి అని సమాచారం.

సింహాచలం దేవాలయం నేపథ్యంలో ఇంటర్వెల్ ఉండబోతుందట. ఆ సన్నివేశంలో అక్కడ ప్రసిద్ధమైన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో హీరో మహేష్ బాబు విలన్ సముతిరఖని కి వరాహావతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు పౌరాణిక పాత్రలో ఇప్పటిదాకా కనిపించలేదు.

అయినప్పటికీ ఈ సినిమా లో పరశురామ్ మహేష్ బాబు వరాహ అవతారం లో కనిపించే సన్నివేశాన్ని చాలా తెలివిగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం కళ్ళు చెదిరే లా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News