సూపర్ స్టార్ మహేశ్ దర్శకుడు అనిల్ రావిపుడి పుట్టిన రోజు సందర్భంగా అతని శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నా డైరెక్టర్ అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో కలిసి సరిలేరు నీవెవ్వరు సినీమా చేయడం గొప్ప అనుభవంగా భావిస్తున్న. మీకు మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నా అంటూ మహేశ్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.
మహేశ్ ట్విట్ పై చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. మీ విషెస్ కు ధన్యవాదాలు మహేశ్, మీతో కలిసి పనిచేయడం వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను. అంటూ అనిల్ రావిపూడి ట్విట్ చేశారు.
మహేశ్ అమహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు చిత్ర టిజర్ ని విడుదల చేసి ఆ అంచనాలను మరింత పెంచేసింది చిత్ర బృందం. అనిల్ రావిపూడి సినిమా అనుకునే ప్రేక్షకులకి ఇది పక్కా మహేష్ బాబు సినిమా అనేలా టిజర్ ని కట్ చేశారు. ఎందుకంటే అనిల్ సినిమాలో ఎక్కువగా కామెడి ఉంటుంది. కానీ విడుదల చేసిన టిజర్ లో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి.
Happy birthday to my director @AnilRavipudi!! Filming with you has been all-in-all, an incredible experience! Wishing you happiness, success & many more blockbusters!🤗🤗🤗 pic.twitter.com/N4pB9RJ5nC
— Mahesh Babu (@urstrulyMahesh) November 23, 2019
Thanks a lot for your wishes sir. You made the journey memorable and working with you is a learning experience I will cherish forever.... 🤗🤗🤗🤗😊😊 https://t.co/fNU4tERQYe
— Anil Ravipudi (@AnilRavipudi) November 23, 2019