OTT Releases This Week (Dec 2-8): ఓటీటీలో ఈ వారం పండగే.. అమరన్ మొదలు మట్కా వరకు..
OTT Releases This Week (Dec 2-8): ఈవారం ఓటీటీలు అదిరిపోయే కంటెంట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
OTT Releases This Week (Dec 2-8): ఈవారం ఓటీటీలు అదిరిపోయే కంటెంట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో గ్రాండ్ విక్టరీ సాధించిన అమరన్‌తో పాటు మట్కా వంటి ఇంట్రెస్టింగ మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉంటే ఈ వారం థియేటర్లలో కేవలం ఒకే ఒక సినిమా అది పుష్ప2 మాత్రమే ఉండడం విశేషం. మరి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తున్న సినిమాలు/వెబ్ సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించిన ‘అమరన్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీతో పాటు.. చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ) డిసెంబరు 04, దట్ క్రిస్మస్ (యానిమేషన్) డిసెంబరు 04, ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ) డిసెంబరు 04, ది అల్టిమేటమ్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 04, బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్) డిసెంబరు 05, ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్) డిసెంబరు 06, బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 06, జిగ్రా (హిందీ) డిసెంబరు 06 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే వీటితో పాటు.. మేరీ (హాలీవుడ్) డిసెంబరు 06, విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ) డిసెంబరు 06 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
* అమెజాన్ ప్రైమ్ వేదికగా మట్కా మూవీ డిసెంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షణ్ థ్రిల్లర్ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా అమెజాన్‌లో ప్రైమ్‌లో ఈ వారం.. జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్) డిసెంబరు 03, పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 04, అగ్ని (హిందీ) డిసెంబరు 06, ది స్టిక్కీ (హాలీవుడ్) డిసెంబరు 06వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
* ఇక జియో సినిమాలో క్రియేచ్ కమాండోస్ (యానిమేషన్ మూవీ) డిసెంబరు 06, లాంగింగ్ (హాలీవుడ్) డిసెంబరు 07 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.
* డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) డిసెంబరు 03 నుంచి, లైట్ షాప్ (కొరియన్) డిసెంబరు 04 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి.
* ఇక మరో ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో మైరీ (హిందీ) డిసెంబరు 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* సోనలివ్‌లో తానవ్2 డిసెంబరు 06వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
* ఇక స్మైల్2 (హాలీవుడ్) డిసెంబరు 04వ తేదీ నుంచి బుక్ మై షో వేదికగా అందదుబాటులోకి రానుంది.