Rewind 2024: చూపే బంగారమాయేనా.? 2024లో తెరకు దూరమైన అందాల తారలు..!

Rewind 2024: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోయేందుకు సిద్ధమైంది. 2024 ఏడాది ముగింపు దశకు చేరుకుంది.

Update: 2024-12-31 07:14 GMT

Rewind 2024: చూపే బంగారమాయేనా.? 2024లో తెరకు దూరమైన అందాల తారలు..!

Rewind 2024: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోయేందుకు సిద్ధమైంది. 2024 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో 2025లో ఎంటర్‌ అయ్యేందుకు అంతా సిద్ధమవుతున్నారు. కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పాలని చూస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్లాన్స్‌ కూడా వేసుకున్నారు. ఇదిలా ఉంటే పాత ఏడాది ఎన్నో జ్ఞాపకాలను పంచింది. ఎన్నో చేదు సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. అయితే ఈ ఏడాదిలో కొందరు నటీమణులు అస్సలు వెండి తెరకు కనిపించలేదు. ఏడాది పాటు ఒక్క సినిమాలో నటించకపోవడం అంటే మాములు విషయం కాదు. ఇంతకీ ఈ ఏడాది వెండి తెరకు దూరమైన ఆ బ్యూటీలు ఎవరు? గ్యాప్‌ రావడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్‌ స్క్రీన్‌పై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటీమణుల్లో అందాల తార త్రిష ఒకరు. ఈ ఏడాది త్రిష ఒక్కంటే ఒక్క సినిమాలో హీరోయిన్‌గా నటించలేదు. అయితే విజయ్‌ హీరోగా తెరకెక్కిన గోట్‌ మూవీలో మాత్రం స్పెషల్‌ సాంగ్‌తో సరిపెట్టింది. పొన్నియన్‌ సెల్వన్‌తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన త్రిష ఈ ఏడాది మాత్రం సైలెంట్‌గా ఉందని చెప్పాలి. కాగా 2025లో వరుస మూవీస్‌తో ఆ లోటును భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది.

* ఈ ఏడాది వెండి తెరపై కనిపించిన మరో అందాల తార నయనతార. ఈ లేడీ సూపర్‌ స్టార్‌ ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. 2023లో వచ్చిన జవాన్‌ తర్వాత నయన తార మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. నయనతార ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో జాలీగా గడుపుతోంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం నిత్యం అభిమాలకు టచ్‌లో ఉంటోందీ బ్యూటీ. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

* కమల్‌ హాసన్‌ గారాల పట్టి మల్టీ ట్యాలెంటెడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. 2023లో వచ్చిన సలార్‌ తర్వాత శృతీ హాసన్‌ మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. అయితే ప్రస్తుతం ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న కూలీ చిత్రంలో శృతిహాసన్‌ నటిస్తోంది. మరి 2025 ఈ బ్యూటీ ఏమేర కలిసి వస్తుందో చూడాలి.

Tags:    

Similar News