సైలెంటుగా సిద్ధమవుతున్న శేఖర్ కమ్ముల

Update: 2019-05-01 13:44 GMT

'ఫిదా' చిత్రంతో కమర్షియల్ దర్శకుడిగా మారిన శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు కొన్ని నెలల క్రితం ఏషియన్ సునీల్ నిర్మాణంలో ఒక సినిమాను చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. డాన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది అని, ఈ చిత్రం కోసం కొత్త వారిని ఎంపిక చేసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ సినిమా గురించి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ మొదలై మూడు పాటలు, కొంత టాకీ పార్ట్ మినహా మిగతా అంతా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

ఈ మిగతా మూడు పాటలు సినిమాకి కీలకం అని, వాటిని చిత్రీకరించేందుకు కనీసం నెల రోజులకు పైగా టైం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఇక టాకీ పార్ట్ దుబాయిలో షూట్ చేస్తారని తెలుస్తోంది. కానీ శేఖర్ కమ్ముల తన సినిమా గురించి అసలు ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం అందరికీ సందేహాలు రేకెత్తిస్తోంది. సినిమాను వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సైలెంట్ గానే విడుదల చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. కనీసం ఈ సినిమా నటీనటుల వివరాలను కూడా బయటకు రాకుండా శేఖర్ కమ్ముల జాగ్రత్త పడడం విశేషం. మరి బజ్ లేకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. 

Similar News