"ఆచార్య" సినిమాకి అదే మైనస్ పాయింటా..?

Acharya: నిజానికి విడుదలకి ముందు కూడా ఈ సినిమాపై అంతగా బజ్ లేదు...

Update: 2022-04-30 08:45 GMT

"ఆచార్య" సినిమాకి అదే మైనస్ పాయింటా..?

Acharya: మెగాస్టార్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదలైన "ఆచార్య" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలై మొదటి రోజు నుంచే నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నిజానికి విడుదలకి ముందు కూడా ఈ సినిమాపై అంతగా బజ్ లేదు.

ఇక విడుదల అయ్యాక కూడా సినిమాకి నెగిటివ్ రివ్యూస్ మాత్రమే వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారిందని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి కొరటాల శివ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమాకి కూడా దేవినేని రంగంలోకి దింపాలని కొరటాల అనుకున్నారు కానీ ఆఖరికి కొన్ని కారణాల వల్ల మణిశర్మ ని ఫైనల్ చేశారు. అప్పటికి "లాహే లాహే", "నీలాంబరి" వంటి పాటలు బాగానే అనిపించినప్పటికీ ఈ సినిమాకి మణిశర్మ అందించిన మిగతా పాటలు మరియు నేపధ్య సంగీతం ఏమాత్రం బాగాలేదని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Tags:    

Similar News