మురళీధరన్ రిక్వెస్ట్ : 800 నుంచి విజయ్ సేతుపతి అవుట్!
Muttiah Muralitharan Biopic : శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా "800" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఎప్పుడైతో ఈ సినిమాని అనౌన్స్ చేశారో అప్పటినుంచి ఈ సినిమా పెద్ద వివాదం నెలకొంది.
Muttiah Muralitharan Biopic : శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా "800" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఎప్పుడైతో ఈ సినిమాని అనౌన్స్ చేశారో అప్పటినుంచి ఈ సినిమా పెద్ద వివాదం నెలకొంది. ఈ సినిమాలో నటించవద్దు అని భారతీరాజా లాంటి దర్శకులు విజయ్ ని సూచించారు. ఈ సినిమాని చేస్తే చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటు నెటిజన్లు ట్రోల్స్ కూడా చేశారు. 'షేమ్ ఆన్ విజయ్ సేతుపతి' అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్విటర్లో ట్రెండ్ కూడా అయింది.
ఈ క్రమంలో నటుడు విజయ్ సేతుపతికి మురళీధరన్ లేఖ రాశాడు.. ఈ లేఖలో తన బయోపిక్ లో నటించవద్దని మురళీధరన్ పేర్కొన్నాడు. మీ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అవమానాలు నాకు మామూలే.. ఈ సినిమా నుంచి మీరు వైదోలండి అని ముత్తయ్య పేర్కొన్నారు. ఈ మాజీ క్రికెటర్ అభ్యర్థన మేరకు నటుడు విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 నుంచి తప్పుకున్నారు. మురళీధరన్ ప్రకటనను విజయ్ సేతుపతి సోమవారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ "ధన్యవాదాలు మరియు వీడ్కోలు" అని పేర్కొన్నాడు. విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మరెవరు ఇందులో నటిస్తారో చూడాలి..
ఇక మురళీధరన్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి 1972, ఏప్రిల్ 17న శ్రీలంకలోని క్యాండీలో తమిళ హిందూ కుటుంబంలో.. సిన్నసామి ముత్తయ్య, లక్ష్మీ దంపతులకు జన్మించారు మురళీధరన్ .టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఎనమిది వందల వికెట్లు తీసి ఘనతని సాధించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ మురళీధరన్ కావడం విశేషం.. అటు వన్డేలో 534 వికెట్లు తీశాడు. చివరగా మురళీధరన్ 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడి క్రికెట్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.