Prashanth Neel: భారీగా రెమ్యునరేషన్ ను పెంచిన ప్రశాంత్ నీల్..
Prashanth Neel Remuneration: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
Prashanth Neel Remuneration: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే విడుదలైన "కే జి ఎఫ్: చాప్టర్ 2" కూడా అన్ని భాషల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరేమో. అయితే ప్రశాంత్ నీల్ ఒక సినిమా కోసం ఎంత తీసుకుంటారో తెలుసా! తాజా సమాచారం ప్రకారం "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా కోసం ప్రశాంత్ పాతిక కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ఇప్పుడు రికార్డులను తిరగరాస్తూ భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. మరి ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం చాలామంది స్టార్ హీరోలు లాగా ప్రశాంత్ నీల్ కూడా తన తదుపరి సినిమా కోసం కొంత రెమ్యునరేషన్ తీసుకొని ప్రాఫిట్స్ లో కూడా కొంత పర్సంటేజ్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
"కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమాకి కూడా ప్రశాంత్ నీల్ పాతిక కోట్ల రెమ్యూనరేషన్ కాకుండా రెవెన్యూ నుంచి 20 శాతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుంటే అందులో ప్రశాంత్ భాగం 120 నుంచి 140 కోట్లు ఉంటుంది. మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమా కోసం ప్రశాంత్ నీల్ 50 కోట్లు రెమ్యునరేషన్ మరియు రెవెన్యూ నుంచి 20 శాతం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.