Keerthy: మెగాస్టార్ సినిమా కోసం ఏకంగా 3 కోట్లు అడిగిన స్టార్ హీరోయిన్

Update: 2021-08-09 06:51 GMT

కీర్తి  సురేష్ - చిరంజీవి (ఫైల్ ఫోటో) 

Keerthy Suresh Remuneration :  ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల లో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ మధ్యనే నితిన్ హీరోగా వచ్చిన "రంగ్ దే" సినిమాలో మెరిసిన కీర్తి సురేష్ ఒక్క సినిమాకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే తాజాగా ఈమె తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం. ఒక సినిమా తర్వాత మరొక సినిమా సైన్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ హీరోగా సూపర్ హిట్ అయిన "వేదాళం" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేష్ ను సంప్రదించగా మహానటి బ్యూటీ ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసిందట.

అయితే సినిమా కి రెండు కోట్లు తీసుకునే కీర్తి సురేష్ ఈ సినిమాకు మాత్రం ఏకంగా మూడు కోట్లు అడిగినట్లు తెలుస్తోంది అయితే ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ అయితేనే చాలా బాగుంటుందని ఏదేమైనా ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ కావాలని దర్శకుడు మెహర్ రమేష్ నిర్మాతలను కోరగా కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా వారు వెనకాడలేదు. అందుకే కీర్తి సురేష్ 3 కోట్లు డిమాండ్ చేసినప్పటికీ వారు వెంటనే ఆమెను ఓకే చేసేశారు. త్వరలో కీర్తి సురేష్ ఈ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నారు.

Tags:    

Similar News