Keerthy Suresh: పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తీ సురేష్
Keerthy Suresh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తీ సురేష్
Keerthy Suresh: మహానటి సినిమాతో జాతీయ అవార్డు కూడా అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్యనే నాని సరసన దసరా సినిమాతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే వదిలిపోగల కీర్తి సురేష్ ఈమధ్య గ్లామర్ పాత్రలకు కూడా ఓకే చెప్పేస్తోంది. ఎంత వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో చాట్ కూడా చేస్తుంది ఈ భామ.
ఈ మధ్యనే కీర్తి సురేష్ మరొకసారి అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొంది. అందులో భాగంగా ఒక అభిమాని కీర్తి సురేష్ ను పెళ్లి గురించి ప్రశ్నించాడు. అయితే పెళ్లి గురించి సూటిగా సమాధానం చెప్పకుండా కీర్తి సురేష్ ఒక వెరైటీ జవాబు ఇచ్చింది. వడివేలు కార్టూన్ అది కూడా రెండు జేబుల్లో ఏముంది, ఏమి లేదు అనే మీమ్ షేర్ చేసింది. అంటే ఇన్ డైరెక్ట్ గా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది కీర్తి సురేష్. ఏదేమైనా కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తూనే ఉంటుంది.
కానీ అవన్నీ కేవలం గాలివార్తలే అని కీర్తి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తుంది. సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ్ లో నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా జయం రవి సరసన కూడా ఒక సినిమా సైన్ చేసింది ఈ భామ. తెలుగులో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "భోళా శంకర్" సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.