ఖుషి కపూర్ ఎంట్రీ గురించి షాకిచ్చిన కరణ్ జోహార్

అలనాటి తార శ్రీదేవి మరియు బోనీకపూర్ గారాలపట్టి గా జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో ఎంట్రీ చేసింది. తను నటించిన మొట్టమొదటి చిత్రం 'ధడక్'. కరణ్ జోహార్ నిర్మాణంలో ఇషాన్, జాన్వి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.

Update: 2018-12-28 10:53 GMT
karankushi
karankushi
  • whatsapp icon

అలనాటి తార శ్రీదేవి మరియు బోనీకపూర్ గారాలపట్టి గా జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో ఎంట్రీ చేసింది. తను నటించిన మొట్టమొదటి చిత్రం 'ధడక్'. కరణ్ జోహార్ నిర్మాణంలో ఇషాన్, జాన్వి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. ఇక అందరి కళ్ళు ఇప్పుడు శ్రీదేవి రెండవ కూతురు నతే జాన్వి కపూర్ పై పడ్డాయి. ఇప్పటికే అక్క బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. మరి చెల్లెలు ఎప్పుడు బాలీవుడ్లో అడుగు పెడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదే విషయం బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్ అయిన కరణ్ జోహార్ ను నేహాధూపియా 'నో ఫిల్టర్ నేహా' అనే టాక్ షోలో అడిగింది. దానికి కరణ్ జోహార్ తానే ఖుషి కపూర్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. బాలీవుడ్ యాక్టర్ జావేద్ జఫ్రి కొడుకు మిజాన్ మరియు ఖుషి కపూర్ హీరోహీరోయిన్లుగా తాను 2019 లో ఒక సినిమా తీయనున్నాడని కరణ్ జోహార్ ప్రకటించాడు. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి యాక్టింగ్ క్లాసెస్ తీసుకుంటూ బిజీగా ఉంది కుషి కపూర్. జాన్వి కపూర్ మొదటి సినిమాతో బాగానే మెప్పించింది. మరి ఖుషి కపూర్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.

Similar News