Thalaivi Trailer: జయలలిత పాత్రలో ఒదిగిపోయిన కంగనా

Thalaivi Trailer: కంగనా రనౌత్ జయలలితపాత్రలో ఒదిగిపోయిన తీరు చూసిన అభిమానులందరూ తలైవిని గుర్తు చేసుకుంటున్నారు.

Update: 2021-03-23 10:27 GMT
Thalavi Movie Trailer

తలైవి సినిమా 

  • whatsapp icon

Thalaivi Trailer: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధానపాత్రలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం 'తలైవి'. పాన్ ఇండియన్ మూవీగా 'తలైవి' చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి కేఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు. మంగళవారం (మార్చి23)న జయలలిత జయంతి సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ట్రైలర్‌ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ''ఒక సినిమా నటితో మనకి రాజకీయాలు నేర్పించాలనుకోవడం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న'' డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్‌ జయలలితను ఆహ్వానించడం..ఆ తర్వాత ఆమె తమిళ రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. అసెంబ్లీలో జయలలిత  చీర లాగి అవమాన పరిచిన సన్నివేశాల్లో ఆమె చెప్పే డైలాగులు తూటాల్లా పేలాయి.

విబ్రి పతాకంపై విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'తలైవి' జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ ఒదిగిపోయింది. ఎంజీఆర్‌ పాత్రలో అరవిందస్వామి నటించారు. ఈ సినిమా ప్రారంభోత్సం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కంగనాపై ట్రోల్స్‌ వచ్చినా, ట్రైలర్‌తో గట్టి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 23న ఈ సినిమా విడుదల కానుంది.

Full View


Tags:    

Similar News