అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతారా.. జయా పై కంగనా ఫైర్!
Kangana Ranaut questions Jaya Bachchan : బాలీవుడ్ నటురు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో భాగంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..
Kangana Ranaut questions Jaya Bachchan : బాలీవుడ్ నటురు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో భాగంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దీని పట్ల సోమవారం పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ చర్చను ఎంపీ రవికిషన్ ప్రస్తావించారు. డ్రగ్స్ వ్యసనం చిత్రపరిశ్రమలో కూడా ఉందని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే అయన మాటలను నేడు(మంగళవారం) జయా బచ్చన్ తప్పుబట్టారు.
కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపరచకూడదని ఆమె అన్నారు. మనకు తిండిపెట్టే చేయినే నరుక్కోవద్దని మండిపడ్డారు. నిన్న లోక్‌సభలో సినీ పరిశ్రమకు చెందిన మా సభ్యుడు ఒకరు దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు సిగ్గుగా ఉందని అన్నారు. అయితే ఆమె చేసిన ఈ వాఖ్యాల పైన ఎంపీ రవికిషన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు.
'నా స్థానంలో మీ కుమార్తె శ్వేత ఉండి ఉంటే, టీనేజ్‌లో ఆమెను కొట్టి, డ్రగ్స్ ఇచ్చి, లైంగికంగా వేధించి ఉంటే ఇలాగే మాట్లాడేవారా? అభిషేక్ కూడా వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరికి ఉరికి వేలాడితే ఇలానే స్పందిస్తారా? మా మీద కూడా కరుణ చూపండి' అంటూ శ్వేతా బచ్చన్, అభిషేక్ పేర్లను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది కంగనా..
Jaya ji would you say the same thing if in my place it was your daughter Shweta beaten, drugged and molested as a teenage, would you say the same thing if Abhieshek complained about bullying and harassment constantly and found hanging one day? Show compassion for us also 🙏 https://t.co/gazngMu2bA
— Kangana Ranaut (@KanganaTeam) September 15, 2020
అటు జయా వాఖ్యాల పైన రవికిషన్ స్పందిస్తూ.. " తానూ మాట్లాడినదానికి జయాజీ మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలను వినియోగించరు, కొందరు ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమను అంతం చేయాలని చూస్తున్నారు. జయాజీ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పరిస్థితి ఇలా లేదు, కానీ ఇప్పుడు మనం పరిశ్రమను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతను భ్రష్టుపట్టించే కుట్రలో పాకిస్తాన్, చైనా భారత్‌లోకి డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్నాయని ఈ భోజ్‌పురి నటుడు ఆరోపించారు.