Charuhasan: ఆసుపత్రిలో చేరిన చారు హాసన్.. ఫొటోలు షేర్ చేసిన సుహాసిని
Charuhasan: చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
Charuhasan: చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రముఖ నటులు కమల్ హాసన్ సోదరుడే చారుహాసన్. దీపావళికి ముందు నాన్న అస్వస్థతకు గురయ్యారు. పండుగ ఎమర్జెన్సీ వార్డులోనే గడిచిపోయిందని సోషల్ మీడియాలో ఆయన కూతురు సుహాసని పోస్ట్ చేశారు. వయస్సు రీత్యా ఎదురైనా ఆరోగ్య సమస్యలతో చారుహాసన్ ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 1న ఆయనకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళం సినిమాల్లో ఆయన నటించారు. కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. కన్నడ హిట్ మూవీ తబరన కథ సినిమాకు ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన హర అనే తమిళ సినిమాలో ఆయన నటించారు.