Rashmika Mandanna: తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం అదే..
Rashmika Mandanna: రష్మిక మందన.. ఇండియన్ సినీ లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
Rashmika Mandanna: రష్మిక మందన.. ఇండియన్ సినీ లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత గీతా గొవిందంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక పుష్ప చిత్రంతో రష్మిక నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను దక్కించుకుంది. దీంతో రష్మిక ప్రస్తుతం నేషనల్ హీరోయిన్‌గా మారిపోయింది.
ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ భేటీలో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనను తాను ఇతరులతో పోల్చుకోవడానికి ఇష్టపడను అని తెలిపిన రష్మిక..తాను తనలాగే ఉండటానికి ఇష్టపడతానన్నారు. అందువల్లే అభిమానులు తనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారని నమ్ముతున్నానని చెప్పుకొచ్చింది. ఇక సినిమా పరిశ్రమలో పురుషాధిక్యం ఉన్న మాట వాస్తవమేనని కుండ బద్దలు కొట్టేసింది.
అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి కొంచెం కొంచెం మారుతుందని రష్మిక అభిప్రాయపడింది. ఇప్పుడు ప్రతిభ ఉంటే చాలని అభిమానుల ఆదరణ లభిస్తుందని ఆమె అన్నారు. ఇక తెలుగులో తక్కువ నటిస్తుండడానికి గల కారణాన్ని సైతం రష్మిక చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని. అయితే హిందీతో పాటు ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానని అన్నారు. అందువల్ల తెలుగు సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, కొందరైతే తనను తిట్టుకుంటున్నారని అన్నారు.
అయితే అది అభిమానులకు తనపై ఉన్న అభిమానమే కారణమని ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదని చాలామంది అడుగుతున్నారని, అలాంటి కథాచిత్రాల్లో నటించాలని ఏ నటి అయినా కోరుకుంటారని, తాను అందుకు అతీతం కాదని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.