Game Changer: మొదలైన 'గేమ్ ఛేంజర్' రికార్డుల వేట.. భారీ మొత్తానికి బాలీవుడ్ రైట్స్..
Game Changer movie distribution rights: ముఖ్యంగా బాలీవుడ్(Bollywood)లో గేమ్ ఛేంజర్ (Game Changer) భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Game Changer movie distribution rights: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 10వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ మరోసారి వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. చెర్రీ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక హైదరాబాద్, న్యూజిలాండ్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్ వంటి ప్రదేశాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథ అందించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్టపికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో గేమ్ ఛేంజర్ భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని నార్త్‌లో తడాని AA ఫిల్మ్స్ ద్వారా విడుదల చేయబోతున్నారు. నార్త్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బాలీవుడ్‌లో ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ వార్త తెలిసిన చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందించారు. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.