Sara Ali Khan: ఆ రాజకీయ నాయకుడి కొడుకుతో సారా అలీ ఖాన్ ప్రేమలో పడిందా?

Update: 2024-10-31 14:01 GMT

Is Sara Ali Khan dating Arjun Prathap Bajwa: బాలీవుడ్ భామ సారా అలీఖాన్ కేదార్ నాథ్ పర్యటన డేటింగ్ పుకార్లకు దారితీసింది. ఈ పర్యటనలో ఆమెతో పాటు మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వా కనిపించడం డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసినట్టైంది. సారా అలీ ఖాన్, అర్జున్ ప్రతాప్ కలిసి పుణ్యక్షేత్రంలో రాతి నిర్మాణానికి నమస్కరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సారా ఎరుపు రంగు ఫుల్ ఓవర్, తెల్లటి ప్యాంటు ధరించగా.. అర్జున్ ముదురు రంగు జాకెట్, బ్రౌన్ ప్యాంటు ధరించాడు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు చూసి నెటిజెన్స్ ఎవరికి తోచినట్లుగా వారు రియాక్ట్ అవుతున్నారు.

సెలబ్రిటీల రియల్ లైఫ్, వారి పర్సనల్ లైఫ్ మ్యాటర్స్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సారా అలీ ఖాన్ కూడా అందుకు తగినట్లుగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినవే. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సారా అలీ ఖాన్, అర్జున్ ప్రతాప్ డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అర్జున్ రాజకీయ వేత్త కుమారుడని.. అతను చాలా మంచి వ్యక్తి అని తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నానంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. అతను ముంబైలో మోడల్ అని.. చాలా ధనవంతుడని వారిద్దరి జోడీ బాగుంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అర్జున్ ప్రతాప్ బజ్వా తండ్రి పేరు ఫతే జంగ్ సింగ్ బజ్వ. ప్రస్తుతం ఆయన పంజాబ్‌లో బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే అర్జున్ కూడా మోడలింగ్ నుండి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక సారా అలీఖాన్ ప్రస్తుతం రొమాంటిక్ చిత్రం మెట్రో ఇన్‌ దినో సినిమాలో కనిపించనుంది. ఈ మూవీలో ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ చిత్రం స్కై ఫోర్స్‌లో నటించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.

Tags:    

Similar News