Ravi Teja: రవితేజ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. రిలీజ్‌ డేట్ కూడా..

Ravi Teja: చాలా రోజుల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నారు మాస్‌ మహా రాజ రవితేజ. టచ్‌ చేసి చూడు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారని చెప్పాలి.

Update: 2024-10-31 09:59 GMT

Ravi Teja: రవితేజ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. రిలీజ్‌ డేట్ కూడా..

Ravi Teja: చాలా రోజుల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నారు మాస్‌ మహా రాజ రవితేజ. టచ్‌ చేసి చూడు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారని చెప్పాలి. డిస్కో రాజా, ధమాకా పర్వాలేదనిపించినా అవేవి రవితేజ స్థాయి విజయాలు మాత్రం కావని చెప్పాలి. ఇక తాజాగా ఎన్నో అంచనాల నడుమ వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ సైతం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న రివితేజ కొత్త సినిమాను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు.

రవితేజ 75వ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'మాస్‌ జాతర' అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ లుతో పాటు సినిమా విడుదల తేదీని సైతం చిత్ర యూనిట్ ప్రకటించింది.

మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటిచారు. ఇందుకు సంబంధించి బుధవారం చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన చేసింది. ఇడియట్ సినిమాలో రవితేజ చెప్పే 'మనదే ఇదంతా' అనే డైలాగ్‌ను క్యాప్షన్‌గా జోడించారు. ఓ జాతర సందడి నడుమ తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్నారు రవితేజ. ఈ సినిమా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైనర్‌మెంట్‌కు ఈ సినిమాలో పెద్దపీట వేసినట్లు దర్శకుడు తెలిపారు. ఈ సినిమా అభిమానులకు విందుభోజనంగా ఉంటుందని అన్నార. రవితేజ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటయని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటిస్తోంది. మరి మాస్‌ జాతరతో రవితేజ మళ్లీ ట్రాక్‌ ఎక్కుతారో చూడాలి. 

Tags:    

Similar News