Kalyandev: కళ్యాణ్ దేవ్‌కి కరోనా.. జాగ్రత్తగా ఉండండి అంటూ అవికా పోస్ట్
Kalyandev: ఇందుగలదు.. అందులేదు అని సందేహం వలదు అనే రీతిలో కొవిడ్ అన్ని ప్రాంతాల్లో విలయతాండవం చేస్తుంది.
Kalyandev: ఇందుగలదు.. అందులేదు అని సందేహం వలదు అనే రీతిలో కొవిడ్ అన్ని ప్రాంతాల్లో విలయతాండవం చేస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజూకు ఈ మహమ్మరి బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు ఈ రక్కసి బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్‌దేవ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా కల్యాణ్‌దేవ్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.
తనకి కరోన 'స్వల్ప లక్షణాలు కనిపించడంతో బుధవారం కొవిడ్ పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఆస్పత్రిలోనే క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తా' అని ఆయన పేర్కొన్నారు. కల్యాణ్ పెట్టిన పోస్ట్ పై స్పందించిన నాగబాబు.. 'నువ్వు త్వరగా కోలుకోవాలి. కోలుకుంటావు అని ఆశిస్తున్నా' అని రిప్లై ఇచ్చారు.
కల్యాణ్‌దేవ్ హీరోగా 'విజేత'మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడ. ప్రస్తుతం ఆయన 'సూపర్‌మచ్చి', 'కిన్నెరసాని' చిత్రాల్లో నటిస్తున్నారు. దీనితోపాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఓ సరికొత్త ప్రేమకథా చిత్రంలోనూ కల్యాణ్‌దేవ్ హీరోగా కనిపించనున్నారు. ఆ సినిమాలో కల్యాణ్‌కు జంటగా అవికా సందడి చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ కరోనా అని తెలియగానే నటి అవికాగౌర్ స్పందిచారు. 'ఓ మై గాడ్!! జాగ్రత్తగా ఉండండి' అని పోస్ట్ చేసింది.