Kajol Viral Video: దుర్గా పూజలో భక్తుడిపై కాజోల్‌ ఆగ్రహం.. వీడియో వైరల్

Update: 2024-10-11 15:45 GMT

Kajol Yelling at Devotee: బాలీవుడ్ నటి కాజోల్ ఎక్కువగా వార్తల్లో ఉండరు. వీలైనంత వరకు చాలా సింపుల్‌గా ఉంటూ మీడియాకు దూరంగా ఉంటారామె. కానీ తాజాగా కాజోల్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో జరిగిన దుర్గా పూజలో మండపం వద్ద కాజోల్ ఒక భక్తుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటనకు సంబంధించిన వీడియో అది. కాజోల్ మైక్ తీసుకుని మరీ అతడిని వారించడంతో పాటు అలాంటి వాళ్లందరినీ వెనక్కి వెళ్లాల్సిందిగా చెప్పింది. అదే మండపం వద్ద కాజోల్‌కి కొంచెం దూరంలోనే ఆలియా భట్ కూడా కామ్‌గా నిలబడి ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు.

ఇంతకీ అక్కడేం జరిగింది? ఎప్పుడూ కూల్‌గా ఉండే కాజోల్‌కి అంత కోపమెందుకొచ్చింది? ఆమెకి కోపం తెప్పించేలా ఆ భక్తుడు ఏం చేశాడు అనేది ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది.

చూశారు కదా.. కాజోల్ పూజలో పాల్గొంటున్న చోట మండపం వద్ద ఓ వ్యక్తి బూట్లు ధరించి నిలబడటం చూసి ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. అతడిని అలా చూస్తూ ఊరుకోలేకపోయిన కాజోల్, వెంటనే అతడిని అక్కడి నుండి వెనక్కి జరగాల్సిందిగా అరిచి మరీ చెప్పింది. అయితే, చుట్టూ భక్తుల హంగామా, పూజ మంత్రాలతో ఆమె అరుపులు పెద్దగా వినిపించలేదు. దాంతో వెంటనే తన పక్కనున్న మహిళ చేతిలో ఉన్న మైక్ లాక్కొని మరీ అదే విషయాన్ని మైకులో చెప్పిందామె. బూట్లు ధరించి వచ్చిన వాళ్లు వెనక్కి వెళ్లాల్సిందిగా అప్పీల్ చేసిన కాజోల్.. ఇది పూజా స్థలం అయినందున కొంచెం భక్తిభావంతో, గౌరవంతో మెలగాల్సిందిగా కాస్త హై పిచ్ టోన్‌తో చెప్పింది. 

Tags:    

Similar News