Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'మత్తు వదలరా2'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
Mathu Vadalara 2 OTT: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ వేదికగా శుక్రవారం అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
2019లో వచ్చిన మత్తు వదలరా మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీ సింహా ఓ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో సత్య తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. మత్తువదలరా పార్ట్1 మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిన విషయం తెలిసిందే.
రితేజ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకులను పలకరించింది. ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ వేదికగా శుక్రవారం అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో 28 రోజుల రన్ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
మరి థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న మత్తు వదలరా సీక్వెల్ మూవీకి ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. మరెందుకు ఆలస్యం దసరా కానుకగా వచ్చిన మత్తువదలరా -2 ను ఓటీటీ లో చూస్తూ ఎంజాయ్ చేసేయండి. ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో నటించింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
కథేంటంటే..
కథ విషయానికొస్తే.. డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబూ మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) ఎన్నో పాట్లు పడి హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదించి, నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఆ క్రమంలోనే చేతివాటం ప్రదర్శిస్తూ కొద్ది మొత్తంలో డబ్బును దొంగలిస్తూ.. ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు.
ఆ సందర్భంలోనే ఓ కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన కేస్ అది. ఆ కేసును ఛేదించి, దాంతో సంబంధం ఉన్న రూ.2 కోట్లు సొంతం చేసుకుకోవాలనే వ్యూహంతో రంగంలోకి దిగుతారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌నకు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన ఓ వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ యువతిని కిడ్నాప్ చేసింది ఎవరు.? ఆ కేసు నుంచి వీళ్లు తప్పించుకున్నారా.? డబ్బు సంపాదించాలనే వారి కోరిక ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.