Ravi Teja: మాట మీద నిలబడని రవితేజ
Ravi Teja: రవితేజ సినిమాల్లోనే హీరోనా? నిజ జీవితంలో కాదా?
Ravi Teja: వరుస డిజాస్టర్లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ కరియర్లో "క్రాక్" సినిమా మర్చిపోలేని సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత విడుదలైన "ఖిలాడీ" సినిమా పెద్దగా మెప్పించకపోగా ఈ మధ్యనే విడుదలైన "రామారావు ఆన్ డ్యూటీ" అభిమానులు మర్చిపోలేని డిజాస్టర్ గా మారింది. మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్ర నష్టాలలో కూరుకు పోయారు. అయితే తాజాగా నిర్మాతల నష్టాలని కొంతవరకు పూడ్చడానికి రవితేజ ముందుకొస్తాడని అభిమానులు అనుకున్నారు కానీ అది నిజం మాత్రం కాలేదు. గతంలో రమ్యునరేషన్ తిరిగిచ్చేస్తా అని చాలాసార్లు మీడియా ముందు ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన రవితేజ వాస్తవానికి మాత్రం ఆ మాట మీద నిలబడడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు.
"రామారావు ఆన్ డ్యూటీ" డిజాస్టర్ అవడంతో రవితేజ కి భారీ రెమ్యూనరేషన్ లు సమర్పించుకున్న నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టాలను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ రవితేజ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. సినిమాల్లో మాత్రం ఎవరికి కష్టమొచ్చినా ముందుండి ఫైట్ లు చేయడం ఓకే కానీ నిజజీవితంలో ఇతరులకి సహాయం చేయకుండా ఇలా మౌనంగా ఉండిపోవడం అభిమానులను సైతం షాక్ కి గురిచేస్తుంది. దీంతో రవితేజ సినిమాలలో మాత్రమే హీరో అని నిజ జీవితంలో కాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.