నాకు అక్కడే ఇగో దెబ్బ తినేది
తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో
తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న అయన ఈ రోజు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. అయన మరణం పట్ల చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. విలక్షణ నటుడిగా.. హాస్యనటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి ఇలా అన్ని రంగాల్లో రాణించారు గొల్లపూడి.. తన 42 వ ఏట ఆయన సినిమాల్లోకి వచ్చారు.
చిరంజీవి హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో అందులో అయన పాత్ర కూడా అంత పెద్ద హిట్టు అయింది. ఆ తర్వాత వెనుకకి తిరగకుండా అయన సంవత్సరానికి దాదాపుగా 31 సినిమాలు చేసుకుంటూ వచ్చారు. గతంలో అయన ఓ యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.
నేను ఎప్పుడూ సినీ రచయితను అవ్వాలని అనుకోలేదు. అలా అని సినీ నటుడు అవ్వాలని అనుకోలేదు. కానీ ఇవన్నీ జరిగిపోయాయి. రచయితగా, నటుడుగా, ఉద్యోగిగా ఇలా చాలా చేసినప్పటికీ నాకు డబ్బుపైన ఆశలేదు. డబ్బే ముఖ్యం అనుకునేవాడిని కాదు. ఉద్యోగిగా నాకు నూరు రూపాయిల జీతం ఉన్నప్పుడు నాకు నూట పాతిక రూపాయిలు కథలు రాస్తే వచ్చేవి..నేను ఎప్పుడు డబ్బుకు వెతుక్కోలేదు.డబ్బు కోసం శ్రమ పడలేదు. నా దగ్గర డబ్బు లేకుండా పోలేదు. నా జీవితంలో డబ్బు అనేది సమస్య ఎప్పుడూ కాలేదు.
నేను గొప్ప నటుడ్ని అని నాకు అనిపించకోవడం వల్ల నాకు పెద్ద నష్టం జరిగేది కాదు. ఒకవేళ గొప్ప రచయితను కాదని అనిపిస్తే మాత్రం నా ఇగో ఎక్కడో దెబ్బ తినేది. నాకు నటన అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నటించడం మొదలు పెట్టానో క్షణం తీరిక లేకుండా పోయింది. ఇంటి ముందు అయిదు కార్లు ఉండేవి. సంవత్సరానికి 31 సినిమాలు చేశా అంటూ చెప్పుకొచ్చారు.