నేను డ్రగ్స్ వాడలేదు : కరణ్ జోహర్
Karan Johar Official Statement : తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలను బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ ఖండించాడు. 2019 జూన్ లో తాను ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడలేదని అధికారిక ప్రకటన విడుదల చేశాడు.
Karan Johar Official Statement : తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలను బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ ఖండించాడు. 2019 జూన్ లో తాను ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడలేదని అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తానెప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని, మరో వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకునే విధంగా ప్రోత్సహించలేదని అయన ఆ ప్రకటనలో వెల్లడించారు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత డ్రగ్ కేసు బయటకు రావడంతో ఆ పార్టీ వీడియో తిరిగి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో దీపికా, రణ్‌బీర్, షాహిద్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ తదితరులు ఉన్నారు.
ఇక సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఈ డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన ఎన్‌సిబి విచారణ చెప్పట్టింది.. అయితే ఈ కేసులో ముందు నుంచి కీలక సూత్రధారిగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేసింది.. ఇక ఈ విచారణలో రియా చిత్ర పరిశ్రమకు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రియా చెప్పినట్టుగా ఎన్‌సిబి కూడా అధికారికంగా పలువురు పేర్లను వెల్లడించింది.
అందులో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ పేర్లు ఉన్నాయి.. నిన్న (గురువారం) రకుల్ ప్రీత్ సింగ్ ని సుమారుగా నాలుగు గంటల పాటు ఎన్‌సిబీ విచారించింది. ఇవాళ మరో ముగ్గురిని ప్రశ్నించనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే నటి దీపికా పదుకొణె తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో కలిసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి శనివారం ఉదయం 9.45 గంటలకు చేరుకుంది.