అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలొద్దు: ఎన్టీఆర్‌

Hyderabad City Police : డిజిటల్ యుగంలోకి వచ్చాక ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా అమ్మాయిలు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డి మోస‌పోతున్నారు.

Update: 2020-10-09 05:20 GMT

NTR 

Hyderabad City Police : డిజిటల్ యుగంలోకి వచ్చాక ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా అమ్మాయిలు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డి మోస‌పోతున్నారు. వారి నుంచి తప్పించుకోలేక మనోవేదనకి గురై కొందరు ఆత్మహత్యలకి కూడా పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెబుతున్నారు. తాజాగా హైదరాబాదు పోలీసులు స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి ఓ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో సోషల్ మీడియా ద్వారా ప‌రిచ‌య‌మైన వ్యక్తి ద్వారా మ‌హిళ ఎంత మాన‌సిక క్షోభ అనుభ‌విస్తుందో క‌ళ్ళకు క‌ట్టిన‌ట్టు చూపించారు.

ఒక అమ్మాయిని ఓ అపరిచిత వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయం అవ్వడం, ఆ పరిచయం తర్వాత లవ్ అంటూ ఆ అమ్మాయిని పర్సనల్ ఫోటోలను తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడం లాంటి కొన్ని సన్నివేశాలతో ఓ షార్ట్ ఫిలింని చిత్రీకరించారు. ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త" అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.


 

Tags:    

Similar News