నేషనల్ సినిమా డే నాడు సినిమాలకు పోటెత్తిన ప్రేక్షకులు.. 75రూ.లకే మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్

Cinema Tickets: ఒక్కరోజే 65 లక్షల మంది సినిమాల వీక్షణ

Update: 2022-09-27 01:30 GMT

నేషనల్ సినిమా డే నాడు సినిమాలకు పోటెత్తిన ప్రేక్షకులు.. 75రూ.లకే మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్

Cinema Tickets: టాలీవుడ్ మొదలుకోని బాలీవుడ్ వరకు దేశవ్యాప్తంగా సినిమా టిక్కెట్ ధరలపై.. పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. చిత్ర పరిశ్రమ కరోనా టైంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న తరుణంలో... కొన్ని రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు పెంచడంతో, ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను చూడటానికి వెనుకంజ వేశారు. తాజాగా ఆడియన్స్ కు అందుబాటులో ధరలో రేట్లు పెట్టడంతో, థియేటర్స్ వద్ద ప్రేక్షకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది.

కరోనా నష్టాలను పూడ్చుకునేందుకు సినిమా వారు టికెట్ల రేట్లను పెంచారు. దీంతో థియేటర్స్ కు ప్రేక్షకులు రావటం మానేశారు.‌ ఈ నేపథ్యంలో తమ తప్పు తెలుసుకున్న‌ మేకర్స్.. ఆడియన్స్‌ను తిరిగి రప్పించడానికి 'సాధారణ రేట్లతో సినిమా చూపిస్తాం' అని పోస్టర్స్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎంత తక్కువ ధరలు పెడితే ప్రేక్షకులు అంత ఎక్కువగా వస్తారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

నేషనల్ సినిమా డే ను దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 23న దేశంలోని ప్రధాన మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కేవలం 75రూపాయలకే.. సినిమా టిక్కెట్లను విక్రయించారు. దీంతో ఒక్క రోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 65 లక్షల మంది థియేటర్లలో సినిమాలను వీక్షించడం ఒక రికార్డుగా నమోదైంది. కొన్ని థియేటర్లలో ఉదయం 6 గంటల షోలు కూడా ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. దీన్ని బట్టి ప్రేక్షకులు సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని.. కాకపోతే అధిక టిక్కెట్ ధరలే ప్రధాన అవరోధంగా మారాయని స్పష్టంగా అర్దమవుతోంది.

నార్త్ బాక్సాఫీస్ వద్ద ధియేటర్స్ లో ఉన్న బ్రహ్మాస్త్ర...చుప్.. సీతారామం చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. దాదాపు అన్నీ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. అప్పటి వరకు మిక్స్డ్ రెస్పాన్స్‌తో నడుస్తున్న బ్రహ్మాస్త్ర షోలన్నీ దాదాపు హౌస్ ఫుల్స్ అయ్యాయి. నార్త్ బెల్ట్‌లో 75రూపాయల ధరను కచ్చితంగా అమలు చేయగా... సెప్టెంబరు 23వ తేదీ ప్రేక్షకులు అత్యధికంగా హాజరైన రోజు అని.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ఒక్క రోజులో 65 లక్షల మంది థియేటర్లకు వచ్చి సినిమా చూడటం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇదంతా కేవలం తక్కువ టికెట్ ధరల వల్లనే సాధ్యమైంది. కనీసం ఇప్పడైనా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, టిక్కెట్ రేట్ల ప్రాముఖ్యత గుర్తిస్తే, అందరికీ మంచిదన్న అభిప్రాయం ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతోంది.

Full View
Tags:    

Similar News