HI Nanna Movie Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ.. నాని ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
HI Nanna Movie Review: న్యాచురల్ స్టార్ నాని తో కలిసి మృణాల్ ఠాకూర్ చేసిన ప్రయోగం హాయ్ నాన్న... దసరా లాంటి మాస్ హిట్ తరువాత శౌర్యువ్ మేకింగ్ లో నాని చేసిన ఈ ప్రయోగం థియేటర్లలో సందడి చేస్తుంది
HI Nanna Movie Review: నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా, శృతి హాసన్, జయరామ్, అంగద్ బేడీ, ప్రియదర్శి తదితరులు
దర్శకుడు : శౌర్యవ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహద్
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని..
న్యాచురల్ స్టార్ నాని తో కలిసి మృణాల్ ఠాకూర్ చేసిన ప్రయోగం హాయ్ నాన్న... దసరా లాంటి మాస్ హిట్ తరువాత శౌర్యువ్ మేకింగ్ లో నాని చేసిన ఈ ప్రయోగం థియేటర్లలో సందడి చేస్తుంది.. ఆల్రెడీ ఒక మాస్ హిట్ తర్వాత క్లాస్ హిట్ నాని కి కలిసి రాదు అనే సెంటిమెంట్ ని హాయ్ నాన్ బ్రేక్ చేసిందా..? లేదా ..?
హాయ్ నాన్న మూవీ కథ విషయానికి వస్తే విరాజ్ (నాని) ఓ ఫేమస్ ఫొటోగ్రాఫర్. ముంబైలో ఓ ఫోటో స్టూడియో లీడ్ చేస్తుంటాడు. తన కూతురు మహి (బేబీ కియారా ఖన్నా)తో కలిసి ఉంటాడు. అయితే మహి పుట్టినప్పటి నుండి లంగ్స్ డిసీజ్‌తో బాధపడటం, డాక్టర్స్ ఎక్కువ రోజులు బతకదు అని చెప్పిన కానీ. తన కూతురుకి ఏమి కాదు అని నమ్మే ఓ తండ్రి. అయితే మరోవైపు మహి తన తల్లి గురించి తెలుసుకోవాలని ఆశ పడుతూ ఉంటుంది. విరాజ్ మాత్రం తన భార్య గురించి కూతురికి చెప్పకపోవటం . అసలు విరాజ్ భార్య ఎవరు ?, ఆమె ఎందుకు విరాజ్ ను వదిలేసి వెళ్ళింది ?, అంతలో విరాజ్ జీవితంలోకి యశ్న ( మృణాల్ ఠాకూర్ ) రావడం ?, ఇంతకీ విరాజ్, అతని కూతురికి యశ్న ఎందుకు బాగా కనెక్ట్ అవుతుంది ?, అసలు ఆమె ఎవరు ,ఆమె గతం ఏమిటి ? అనేదే ఈ సినిమా స్టోరీ లైన్....
విరాజ్ పాత్రలో న్యాచురల్ స్టార్ నాని, కూతురిగా బేబీ కియారా ఖన్నా, అలానే యశ్న గా మృణాల్ ఠాకూర్
పాత్రలో పాతుకుపోయారు అని చెప్పొచ్చు ..ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి నాని న్యాయం చేశాడు. మెయిన్ గా క్లైమాక్స్ సీక్వెన్స్ లో అలానే కూతురితో వచ్చిన చాలా సీన్స్ లో నాని నటన సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అలాగే నానికి ,మృణాల్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఉందంటున్నారు...
హాయ్ నాన్న మూవీ ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ , లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.. డైరెక్టర్ శౌర్యవ్ తీసుకున్న కథ బాగున్నప్పటికీ..కథనం చాల స్లో గా ఉందంటున్నారు..అలానే ఎమోషనల్ గా సాగే తండ్రీకూతుళ్ల సీన్స్, నాని ,మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ డ్రామా, అలాగే ప్రియదర్శి అండ్ కో వారి పాత్ర మేరకు పర్లేదనిపిస్తే, మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.. ఇక ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ గా ఉంటె బాగుండేదంటున్నారు...
ఫైనల్ గా హాయ్ నాన్న మూవీ డీసెంట్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ గా మారాయి. ఓవరాల్ గా శౌర్యవ్ మేకింగ్ లో నాని చేసిన ఈ హాయ్ నాన్న మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు..