Haryana Chief Minister praises Sonu Sood : సోనూసూద్ ని ప్రశంసించిన హర్యానా ముఖ్యమంత్రి
Haryana Chief Minister Praises Sonu Sood : కరోనా లాక్ డౌన్ సమయం నుండి వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట నటుడు
Haryana Chief Minister Praises Sonu Sood : కరోనా లాక్ డౌన్ సమయం నుండి వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట నటుడు సోను సూద్ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అందరి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. కార్మికులు కాలి నడకన వెళ్లకుండా వారికి భోజనం ఏర్పాటు చేసి, వారికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి మరీ ఇంటికి చేర్చాడు. దీనితో ఎక్కడ చూసినా సోనూసూద్ పేరు మారుమ్రోగింది. అయితే ఇలా సేవలకి సోనూసూద్ ఎక్కడ కూడా బ్రేక్ వేయడం లేదు.. కష్టం ఎక్కడుంటే అక్కడ సోనూసూద్ ఉంటున్నాడు.
సోనూసూద్ సాయాలకి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ప్రశంసల కురిపిస్తున్నారు. సోనుసూద్ సేవలకి గాను తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ స్వయంగా సోనుసూద్ కి ఫోన్ చేసి ప్రశంసించారు. కరోనా లాంటి విపత్కరమైన సమయంలో వలస కార్మికులని సొంత గ్రామాలకి పంపినందుకు గాను అయన కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది కార్మికులను ఇంటికి చేర్చారని కొనియాడారు. హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడిన సోనుసూద్ .. మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. నా ప్రయత్నాన్ని మీరు మెచ్చుకున్న తీరు నాకు మరింత బలాన్ని ఇచ్చింది. త్వరలో చంఢీఘర్ లేదా కర్నాల్‌కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని సోనూసూద్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడారు.
సోనూసూద్ తన సహాయానికి బ్రేక్ లు వేయడం లేదు.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ట్రాక్టర్ కొనిస్తానని హామీ ఇచ్చిన రెండు గంటల్లోనే ట్రాక్టర్ ని సదరు రైతు ఇంటిముందు ఉంచాడు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన శారద అనే అమ్మాయికి కూడా సహాయం చేస్తానని మాట ఇచ్చాడు సోనూసూద్.. తాజాగా అస్సాం వరదల్లో తన ఇంటిని కోల్పోయిన ఓ మహిళకి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు సోనూసూద్.